
ఈమధ్య యూత్ ఆడియెన్స్ అందరిని అలరించిన సినిమా ఆరెక్స్ 100. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ సినిమా 3 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అయ్యి పాతిక కోట్ల దాకా వసూళు చేసింది. ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి సినిమా రిలీజ్ కు ముందే ఇది పక్కా హిట్ అని చెప్పాడు. చెప్పినట్టుగానే హిట్ కొట్టిన ఈ దర్శకుడికి నిర్మాత అశోక్ రెడ్డి నుండి సర్ ప్రైజ్ గిఫ్ట్ అందింది.
టాలీవుడ్ దర్శక నిర్మాతలు కొత్త ట్రెండ్ కొనసాగిస్తున్నారు. సినిమా అనుకున్న విధంగా హిట్ అయితే దర్శకుడికి బోనస్ గా గిఫ్టులు ఇస్తున్నారు. శ్రీమంతుడు నుండి ఈ పంథా కొనసాగుతుంది. ఇక లేటెస్ట్ ఆరెక్స్ 100 మూవీ డైరక్టర్ కు జీప్ కంపెనీ కారు గిఫ్ట్ గా ఇచ్చాడు నిర్మాత అశోక్ రెడ్డి. ఈ గిఫ్ట్ ఇస్తూ వారు దిగిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రివీల్ అయ్యాయి.