
అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ వచ్చే వారం గీతా గోవిందం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ భామ రష్మిక మందన నటించింది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక గీతా గోవిందంతో మరింత క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. ఈ సినిమాలో లీడ్ పెయిర్ జోడి బాగుంది. అందుకే మరో సినిమాకు ఇద్దరు కలిసి పనిచేయనున్నారు.
భరత్ కమ్మ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా కామ్రేడ్. ఫైట్ ఫర్ వాట్ యు లవ్ ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక ఎంపిక విజయ్ సలహా మేరకే అని తెలుస్తుంది. గీత గోవిందం హిట్ కొడితే ఈ కాంబినేషన్ లో వస్తున్న కామ్రేడ్ కు క్రేజ్ దక్కినట్టే. అర్జున్ రెడ్డి తర్వాత అదే తరహా పాత్రలో కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడట విజయ్ దేవరకొండ. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.