మహేష్ టైటిల్ అది కాదట..!

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుండి ఆగష్టు 9న ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకు సంబందించి రిషి అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాలోని మహేష్ పాత్ర పేరు రిషి అని రివీల్ చేశాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా అదే సినిమా టైటిల్ అని ఫిక్స్ అయ్యారు. కాని అది టైటిల్ కాదట. కేవలం మహేష్ పాత్ర పేరే అని తెలుస్తుంది.

ఇక మహేష్ బర్త్ డే కానుకగా ఓ రోజు ముందే ఈ సినిమా నుండి మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. టైటిల్ మాత్రం మరో స్పెషల్ డే నాడు రివీల్ చేస్తారట. రాజసం అన్న టైటిల్ బాగా వినపడుతుంది. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.