
విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా గీతా గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్ని వాసు నిర్మించిన ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగష్టు 12న వైజాగ్ ఆర్కే బీచ్ లో జరుపనున్నారట.
ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రప్పించే ప్లాన్ చేస్తున్నారట. గీతా ఆర్ట్స్ లో మూవీ కాబట్టి చిరంజీవి పిలవగానే వచ్చేస్తాడు. మెగాస్టార్ అతిథిగా గీతా గోవిందం ఈవెంట్ అంటే సినిమాకు మరింత క్రేజ్ వచ్చేసినట్టే. ఇక ఈమధ్య పరిశ్రమ పెద్దగా ఎవరు ఎలాంటి ఫంక్షన్ కు పిలిచినా వెళ్లి తన సపోర్ట్ ఇస్తున్నాడు చిరంజీవి. మరి విజయ్ సినిమాకు మెగా సపోర్ట్ ఏమేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.