
డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే కాదు నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ అవుతూ తన ప్రొడక్షన్ లో సినిమా అంటే అదో బ్రాండ్ అనేలా క్రేజ్ తెచ్చుకున్న దిల్ రాజు ఈమధ్య తన సినిమాల విషయంలో మాట్లాడుతున్న తీరు చూసి సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వెబ్ మీడియాలో దిల్ రాజు అతి చేష్టల మీద రకరకాల ఆర్టికల్స్ రాశారు. అవి చేరాల్సిన చోటికి చేరాయి. ఆగష్టు 9న రిలీజ్ అవుతున్న శ్రీనివాస కళ్యాణం ప్రెస్ మీట్ లో దిల్ రాజు తన మీద వచ్చిన ఆర్టికల్స్ చూసి హర్టయినట్టు వెళ్లడించాడు.
శ్రీనివాస కళ్యాణం సినిమాపై తను చూపించిన ఇంట్రెస్ట్ ఈ సినిమాకు తానో ఘోస్ట్ డైరక్టర్ అని.. దిల్ రాజు డెబ్యూ మూవీ అని వివిధ రకాలుగా వార్తలు రాశారు. దర్శకులకు సపోర్ట్ చేస్తా తప్ప వారి వ్యవహారాలలో ఎప్పుడు జోక్యం చేసుకోలేదని చెప్పాడు దిల్ రాజు. ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందించాలనే మేం కృషి చేస్తాం. ఇలాంటి వార్తలు సబబు కాదని అన్నాడు దిల్ రాజు. అంతేకాదు డైరక్టర్, ప్రొడ్యూసర్ రిలేషన్ బాగుంటేనే ప్రేక్షకులు మెచ్చే సినిమా తీయగలమని చెప్పారు. శ్రీనివాస కళ్యాణం మీద మరోసారి తన పూర్తి నమ్మకాన్ని వెళ్లబుచ్చారు దిల్ రాజు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.