బన్ని పొలిటికల్ మూవీ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత ఏ సినిమా చేస్తాడన్న డౌట్ ఇంకా క్లియర్ కాలేదు. విక్రం కుమార్ డైరక్షన్ లో సీమా ఇంకా ఫైనలైజ్ కాలేదని తెలుస్తుంది. ఇక ఈమధ్య దిల్ రాజు, బన్ని కలిసి సభకు నమస్కారం సినిమా చేస్తారని వార్తలు రాగా అది కాస్త తుస్సుమనిపించేశారు. లేటెస్ట్ గా బన్ని మెచ్చే కథతో ఓ కొత్త దర్శకుడు సర్ ప్రైజ్ చేశాడట. 

సంతోష్ రెడ్డి చెప్పిన కథకు బన్ని షాక్ అయ్యాడట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటి స్టార్స్ లో రానా, మహేష్ ఆల్రెడీలీడర్, భరత్ అనే నేను సినిమాలతో రాజకీయ నేపథ్యం సినిమాలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. ఇక రాబోతున్న బన్ని పొలిటికల్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.     

దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో బన్ని తన తర్వాత మూవీ అదే చేస్తాడని అంటున్నారు. ఆర్య తర్వాత నా పేరు సూర్య వక్కతం వంశీతో కొత్త దర్శకుడితో సినిమా చేసిన బన్ని మళ్లీ అలాంటి రిస్క్ చేస్తాడా అని కొందరు డౌట్ పడుతున్నారు.