గీతా గోవిందం రివర్స్ స్ట్రాటజీ..!

అర్జున్ రెడ్డితో యూత్ లో పెరిగిన తన ఫాలోయింగ్ దృష్టిలో ఉంచుకుని తన ప్రతి అప్డేట్ క్రేజీగా ఉండేలా చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం గీత గోవిందం సినిమాతో ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పరశురాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద సమర్పించగా బన్ని వాసు నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పర్ఫెక్ట్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నారు.

సినిమాపై ఆసక్తి కలిగేలా సినిమాలోని డిలీటెడ్ సీన్స్ ముందే యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారట. అదేంటి సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక కదా డిలీటెడ్ సీన్స్ రిలీజ్ చేసేది అంటే అదే గీత గోవిందం స్ట్రాటజీ అని తెలుస్తుంది. సినిమాలో డిలీటెడ్ సీన్స్ చూసి ఇవే సూపర్ అనిపించేలా ఉంటే ఇక సినిమాలో ఎలాంటి క్రేజీ సీన్స్ ఉన్నాయో అనిపించేలా ఆడియెన్స్ ఫీల్ అయ్యేలా చేస్తారట.    

గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా కూడా ప్రేక్షకులను అలరించేందుకు వస్తుంది. ఆగష్టు 9న నితిన్ శ్రీనివాస కళ్యాణం రిలీజ్ అవుతుండగా వారం గ్యాప్ లోనే విజయ్ దేవరకొండ తన సత్తా చాటాలని వస్తున్నాడు.