
బాలకృష్ణ నటిస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో ఫైనల్ కాస్టింగ్ ఎవరన్నది ఒక్కొక్కరుగా రివీల్ చేస్తున్నారు. ఇప్పటికే బసవతారకమ్మగా విద్యా బాలన్ ఎంపిక కాగా.. చంద్రబాబు నాయుడిగా రానా నటిస్తున్నాడని తెలిసిందే. ఇక కొన్నాళ్లుగా ఏయన్నార్ గా ఎవరు చేస్తారన్న కన్ ఫ్యూజన్ ఉంది. దానికి ఈరోజు సమాధానం దొరికింది. క్రిష్, బాలకృష్ణలతో ఉన్న పిక్ షేర్ చేసి తాను ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఉంటున్న విషయం ఎనౌన్స్ చేసిన రానాకు రిప్లైగా సుమంత్ కూడా తాను ఆ సినిమాలో భాగమవుతున్నానని ట్వీట్ చేశాడు.
ఏయన్నార్ గా తను నటిస్తున్న విషయాన్ని డిక్లేర్ చేశాడు సుమంత్. అక్కినేని వారసుడు నాగ చైతన్య ఆల్రెడీ మహానటి సినిమాలో ఏయన్నార్ గా నటించాడు. అయితే కొన్నాళ్లుగా బాలకృష్ణ, నాగార్జుల మధ్య ఉన్న కోల్డ్ వార్ లో భాగంగా నాగ్ ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నటించేందుకు ఒప్పుకోలేదు. అందువల్ల ఆ ఆఫర్ సుమంత్ దగ్గరకు వెళ్లింది. మరి ఏయన్నార్ గా సుమంత్ ఎలా ఉంటాడో చూడాలి.