SSMB25 సూపర్ స్టార్ సందడి మొదలైంది..!

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ముగ్గురు బడా నిర్మాతల కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా రేంజ్ మరింత పెంచేలా సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కెరియర్ లో 25వ సినిమాగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆగష్టు 9న మహేష్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయనున్నారు.  

దానికి ముందుగానే SSMB25 అంటూ ఓ ఏంబ్లం రిలీజ్ చేశారు. మహేష్ తనయురాలు సితార, వంశీ పైడిపల్లి తనయురాలు ఆద్య కలిసి ఈ ఏంబ్లం రిలీజ్ చేయడం జరిగింది. స్టార్ సింబల్ మధ్యలో మహేష్ షాడో.. దాని మీద SSMB25 అని రాసి ఉంది. చూస్తుంటే ఈ సినిమా ప్రమోషన్స్ ఇదే రేంజ్ లో కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.