కే.టి.ఆర్ కు చెక్ ఇచ్చిన సుబ్బరాజు..!

రీసెంట్ గా తన కెరియర్ లో మొదటసారి వచ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఆక్షన్ లో పెట్టి అలా వచ్చిన పాతిక లక్షల రూపాయలను తెలంగాణా సిఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చాడు విజయ్ దేవరకొండ. తన ఆలోచనలతో అందరిని అవాక్కయ్యేలా చేస్తున్న ఈ హీరో యూత్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ చెక్ ఇచ్చిన టైంలో తెలంగాణా మంత్రి కే.టి.ఆర్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇక ఇప్పుడు అదే దారిలో సిఎం రిలీఫ్ ఫండ్ కు చెక్ అందించాడు విలన్ కమ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ సుబ్బరాజు. నిన్న జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో కే.టి.ఆర్ ను చూసి దగ్గరకు వెళ్ళిన సుబ్బరాజు సిఎం రిలీఫ్ ఫండ్ కు చెక్ అందచేశాడట. ఈ విషయాన్ని కే.టి.ఆర్ ప్రస్థావిస్తూ ఆయన సహాయానికి కృతజ్ఞతలు తెలిపాడు. బాహుబలి-2లో కుమార వర్మగా నటించి జపనీస్ స్క్రీనింగ్ లో స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించబడిన సుబ్బరాజు తెర మీద ప్రతినాయకుడిగా కనిపించినా రియల్ లైఫ్ లో మంచి మనసు చాటుకున్నాడు.