
అక్కినేని యువ హీరో అఖిల్ హీరోగా తన 3వ సినిమా వెంకీ అట్లూరి డైరక్షన్ లో మొదలు పెట్టాడు. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా దర్శకుడి మొదటి సినిమా తొలిప్రేమ లానే లవ్ స్టోరీతో వస్తుందట. అఖిల్ ఇన్నాళ్లలా సినిమా సినిమాకు గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన తర్వాత సినిమాపై క్లారిటీ తెచ్చుకున్నాడు. వెంకీ అట్లూరి సినిమా పూర్తి కాగానే సుకుమార్ కథతో అఖిల్ సినిమా చేస్తాడని టాక్.
సుకుమార్ రైటింగ్స్ లో సుకుమార్ నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాను కుమారి 21ఎఫ్ డైరక్టర్ సూర్య ప్రతాప్ డైరక్ట్ చేస్తాడట. కుమారి 21ఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రాజ్ తరుణ్, హెబ్భా పటేల్ లకు లైఫ్ ఇచ్చిన సినిమా కుమారి 21ఎఫ్. అదేవిధంగా మరోసారి సుకుమార్ కథతో ఈసారి అఖిల్ హీరోగా ఈ సినిమా వస్తుందట. కథ ఓకే చేశాడట అఖిల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథ కూడా కుమారి రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.