
ఫిదా భామ సాయి పల్లవికి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న ఈ అమ్మడు తెలుగులో మాత్రం విమర్శలను ఎదుర్కుంటుంది. నటన పరంగా ఆమెకు ఆమే సాటి అనేలా ఉన్నా షూటింగ్ టైంలో ఆమె ప్రవర్తన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కణంలో నాగ శౌర్యతో, ఎం.సి.ఏ షూటింగ్ లో నానితో గొడవపడిన సాయి పల్లవి లేటెస్ట్ గా శర్వానంద్ తో కూడా గొడవపడ్డదట.
హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న పడి పడి లేచే మనసు సినిమాలో శర్వానంద్, సాయి పల్లవి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా టైంలో శర్వా, సాయి పల్లవి ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. అయితే తనకు శర్వాకు ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి. ఎవరో కావాలని తన మీద ఇలా తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నది. తాను ఎవరితో గొడవ పడట్లేదని క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి.