ఆరెక్స్ 100పై నాగార్జున కామెంట్..!

రీసెంట్ గా వచ్చిన ఆరెక్స్ 100 సినిమా విజయవంతం అయ్యింది. 3 బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్స్ లో చేశారు. ఇక ఈ సినిమా గురించి ఇంతకుముందు చాలామంది సెలబ్రిటీస్ మాట్లాడారు. లేట్ గా రెస్పాండ్ అయినా లేటెస్ట్ గా సినిమాపై స్పందించాడు కింగ్ నాగార్జున.

ఆరెక్స్ 100 సినిమా క్లైమాక్స్ రెండు రీళ్లు చూశానని.. ఇంప్రెస్ చేసిందని.. సినిమా మొత్తం త్వరలోనే చూస్తానని చెప్పిన నాగార్జున సినిమా గురించి బయట వినపడ్డ కామెంట్స్ అన్నిటిని కొట్టిపారేశాడు. అడల్ట్ మూవీ, ఏ సర్టిఫికెట్ మూవీ అంటూ ఆరెక్స్ 100 మీద కామెంట్స్ వచ్చాయి. సినిమా అంటే ఎలా అయినా తీయొచ్చు అన్ని రకాల సినిమాలు రావాలని అన్నారు నాగార్జున. మరి నాగ్ మెప్పు పొందారంటే కచ్చితంగా దర్శకుడికి లక్ కలిసి వచ్చినట్టే.