
యువ హీరోల్లో ప్రయోగాలకు పెద్దపీఠ వేసే శర్వానంద్ మహానుభావుడు తర్వాత హను రాఘవపుడి డైరక్షన్ లో పడి పడి లేచే మనసు సినిమా చేస్తున్నాడు. ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత శర్వానంద్ ఓ ఫ్లాప్ హీరోతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. మహేష్ లాంటి స్టార్ హీరోతో బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ సినిమా చేశాడు శ్రీకాంత్ అడ్డాల.
కొత్తబంగారు లోకం సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ముకుందా మళ్లీ నిరాశ పరచగాగా బ్రహ్మోత్సవం అతనితో సినిమా అంటేనే నిర్మాతలను భయపడేలా చేసింది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ వారు శ్రీకాంత్ అడ్డలతో సినిమా చేస్తున్నారని టాక్. శర్వానంద్ హీరోగా ఆ సినిమా ఉంటుందట. చూస్తుంటే శర్వానంద్ తో అయినా శ్రీకాంత్ హిట్ కొడతాడో లేదో చూడాలి.