నాగ చైతన్యలో ఇంత మార్పా.. శైలజా రెడ్డి అల్లుడు టీజర్..!

 అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను నాగ వంశీ నిర్మించారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించింది. ఆగష్టు 31న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. సినిమాలో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది.

ఆమె పాత్ర ఎంత పవర్ ఫుల్ అన్నది సినిమా టైటిల్ లో ఆమె పేరు పెట్టినప్పుడే తెలుస్తుంది. ఇక టీజర్ విషయానికొస్తే నాగ చైతన్య కొత్తగా కనిపిస్తున్నాడు. పెళ్లి తర్వాత చైతు చేసిన మొదటి సినిమా కాబట్టి సినిమాలో నాగ చైతన్య ప్లెసెంట్ లుక్ తో కనిపించాడు. అను ఇమ్మాన్యుయెల్ కూడా టీజర్ లో కనిపించినంత వరకు ఇంప్రెస్ చేసింది. మహానుభావుడు తర్వాత మారుతి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.