
ఎం.ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీతో బాలీవుడ్ లో మెరిసిన కియరా అద్వాని తెలుగులో సూపర్ స్టార్ మహేష్ పక్కన భరత్ అనే నేను సినిమాలో ఛాన్స్ అందుకుని సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో భరత్ నిర్మాత దానయ్య తన తర్వాత సినిమాకు ఆమెను తీసుకున్నాడు. ఇక ఈమధ్యనే బాలీవుడ్ లస్ట్ స్టోరీస్ తో అదరగొట్టిన కియరా బీ టౌన్ హీరోతో ప్రేమలో పడ్డదని టాక్.
బాలీవుడ్ రొమాంటిక్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా.. ఇంతకుముదు అలియాతో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు రాగా అందతా తూచ్ అనేశాడు.. ఇక ఈమధ్య శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ తో తరచు కనిపిస్తున్నాడు. ఆమె కూడా బోర్ కొట్టేసింది అనుకుంటా అందుకే లేటెస్ట్ గా కియరా అద్వానితో క్లోజ్ గా ఉంటున్నాడని తెలుస్తుంది. కియరా అద్వాని బర్త్ డే వేడుకలకు సిద్ధార్థ్ అటెండ్ అయ్యాడు. మరి అమ్మడు ఇప్పుడే లైం లైట్ లోకి వస్తుంది మరి ఈ ప్రేమ గాలి అమ్మడికి తగలకుంటేనే బెటర్ లేదంటే కెరియర్ గాలికి వదిలేయాల్సి వస్తుంది.