
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డికి కొత్త సంస్య వచ్చి పడ్డది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రంగస్థలం సెట్స్ లో జరుపుకుంటుంది. శేరిలింగంపల్లిలో గల ఈ సెట్స్ రంగస్థలం కోసం మాత్రమే వేసినట్టు తెలుస్తుంది.
అయితే రెవిన్యూ అధికారుల పర్మిషన్ లేకుండా వాటిని సైరాకు వాడుతున్నట్టు తెలియగా రెవిన్యూ అధికారులు సైరా సెట్ ను ధ్వంసం చేశారు. అంతేకాదు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో చిత్ర దర్శక నిర్మాతల మీద కేసు కూడా పెట్టారట. సినిమా షూటింగ్ కు ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉండగా రంగస్థలం కోసం పర్మిషన్ తీసుకుని అది పూర్తి చేశారని. ఇక ఆ తర్వాత సైరా షూటింగ్ కూడా అందులో కొనసాగించేలా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని రెవిన్యూ అధికారులు పేర్కొన్నారు.
దీని గురించి నిర్మాత రాం చరణ్ కు నోటీసులు పంపించిన ఎలాంటి రెస్పాన్స్ రాలేదని అందుకే రెవిన్యూ అధికారులు యాక్షన్ లోకి దిగారని తెలుస్తుంది. సైరా కోసం వేసిన నరసిం హారెడ్డి ఇంటి సెట్ ను అధికారులు ధ్వంసం చేశారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగిందని తెలుస్తుంది.