
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మొదటి, రెండు పార్టులు ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. బాహుబలి అన్న మాట వినపడితేనే దేశ సిని ప్రేక్షకుల ఒళ్లంతా పులర్కరించేలా చేశారు. సినిమా మొదలైన నాటి నుండి రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించేదాకా వాటన్నిటికి ప్రేక్షకులు సాక్ష్యంగా ఉన్నారు. బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి పెరిగింది.
ఇక ఇప్పుడు బాహుబలి 3 పై డిస్కషన్స్ మొదలయ్యాయి. విజయేంద్ర ప్రసాద్ బాహుబలి-3కి కథ సిద్ధం చేస్తున్నారని టాక్. బాహుబలి నిర్మాతలు ఈ సినిమా సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నారట. ఓ పక్క రాజమౌళి మెగా నందమూరి మల్టీస్టారర్ పై గురి పెట్టగా బాహుబలి-3 చర్చలు వస్తున్నాయి. మరి నిజంగానే బాహుబలి కొనసాగింపు ఉంటుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.