
మెగా బ్రదర్ నాగ బాబు తనయురాలు నిహారిక హీరోయిన్ గా చేసిన రెండవ ప్రయత్నం హ్యాపీ వెడ్డింగ్. సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో పాకెట్ సినిమాస్ వారు నిర్మించారు. లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యింది. నిహారిక ఉన్నా కూడా ఈ సినిమా కలక్షన్స్ నామమాత్రంగానే ఉన్నాయి.
సినిమా పబ్లిసిటీ ఖర్చుతో కలుపుకుని 3 కోట్ల దాకా పెట్టారట అయితే కలక్షన్స్ మాములుగానే ఉన్నా ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ మాత్రం 3 కోట్ల దాకా పలికాయని టాక్. ఆ లెక్కన చూస్తే హ్యాపీ వెడ్డింగ్ సేఫ్ ప్రాజెక్ట్ అయ్యిందని చెప్పొచ్చు. నిహారిక నటించిన మొదటి సినిమా ఒక మనసు ప్రేక్షకాదరణ పొందలేదు. ఆ సినిమాతో పోల్చితే హ్యాపీ వెడ్డింగ్ చాలా బెటర్.