
తెలంగాణా మంత్రి కే.టి.ఆర్ ట్విట్టర్ లో గ్రీన్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తూ మొక్కలు నాటారు. ఇక దీనికి కొనసాగింపుగా మహేష్ కు ఛాలెంజ్ విసిరారు కే.టి.ఆర్. అయితే ముందు మహేష్ ఈ గ్రీన్ ఛాలెంజ్ ను లైట్ తీసుకోగా నెటిజెన్స్ నుండి కామెంట్స్ వస్తుండటంతో ఫైనల్ గా మహేష్ కూడా మామిడి మొక్క నాటుతూ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ ట్వీట్ చేశాడు. తన కూతురు సితార కూడా ఈ గ్రీన్ చాలెంజ్ లో పాల్గొని మహేష్ కు సహాయం చేసింది.
ఇక మహేష్ కూడా ఈ గ్రీన్ ఛాలెంజ్ ను తన కూతురు సితార, కొడుకు గౌతంలతో పాటుగా దర్శకుడు వంశీ పైడిపల్లికి ఛాలెంజ్ చేశాడు. మొత్తానికి కే.టి.ఆర్ ఛాలెంజ్ చేసిన వెంటనే టైం కుదరకో మరేమో కాని సోషల్ మీడియా విమర్శల ద్వారా మహేష్ మొక్కలు నాటడం ఫ్యాన్స్ ను సంతోష పరచింది. లేట్ గా స్పందించినా లేటెస్ట్ గా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన మహేష్ అందరిని ఇంప్రెస్ చేశాడు.