బాలయ్యను కన్ ఫ్యూజ్ చేస్తున్న 80 కోట్ల ఆఫర్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్.టి.ఆర్ బయోపిక్ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2019 సంక్రాంతికి రిలీజ్ చేసేలా చూస్తున్నారు. బాలకృష్ణ 64 గెటప్పులలో కనిపించబోతున్న ఈ సినిమా ఎన్.టి.ఆర్ సిని, రాజకీయ నేపథ్యంతో రాబోతుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సోనీ నుండి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది.

తెలుగు, తమిళ, హింది మూడు భాషల రైట్స్ తో పాటుగా వరల్డ్ వైడ్ గా ఎన్.టి.ఆర్ బయోపిక్ ను సోనీ సంస్థ 80 కోట్లు ఆఫర్ చేసిందట. ఈ ఆఫర్ బాలయ్య ముందు ఉంచారట. బయోపిక్ సినిమాకు ఈ రేంజ్ ఆఫర్ రావడం గొప్ప విషయమే అయితే బాలకృష్ణ ఇంకా సోనీ వారికి ఎస్ అని కాని, నో అని కాని చెప్పలేదట. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్న బాలయ్య సొంతంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట.