అత్తారింటికి దారేది తమిళ్ రీమేక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన సినిమా అత్తారింటికి దారేది. పవర్ స్టార్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా పవర్ స్టార్, మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. త్రివిక్రం టాలెంట్ చూపే మాటలు.. దేవి సత్తా చాటిన పాటలు.. ముఖ్యంగా సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది.

ఈ సినిమా హిట్ అయిన తర్వాత మళ్లీ అజ్ఞాతవాసి సినిమా చేశారు పవన్, త్రివిక్రం. ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. అత్తారింటికి దారేది సినిమా కన్నడలో రీమేక్ అయ్యింది. అక్కడ సుదీప్ అందులో హీరోగా నటించారు. ఇక ఇప్పుడు ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేయాలని చూస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనేసిందట. త్వరలోనే ఈ సినిమా రీమేక్ సెట్స్ మీదకు తీసుకెళ్తారట. లైకా ప్రొడక్షన్స్ కాబట్టి ఇందులో స్టార్ హీరోనే నటించే అవకాశం ఉంది.