చిరంజీవి అర్జున్ అలియాస్ చిలసౌ..!

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుశాంత్ రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో నటించిన మూవీ చిలసౌ. టీజర్, ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా దర్శకుడు రాహుల్ రవింద్రన్ ఈ సినిమాకు అనుకున్న టైటిల్ చిలసౌ కాదట. మొదట ఈ సినిమాకు చిరంజీవి అర్జున్ అని పెట్టుకున్నాడట. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలోనే అర్జున్ రెడ్డి అని సినిమా రిలీజ్ అయ్యింది. 

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సంచలనాలు అంతా ఇంతా కాదు. సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో చిరంజీవి అర్జున్ టైటిల్ పెట్టే ఆలోచనని వెనక్కి తీసుకున్నాడట. అలా చిరంజీవి అర్జున్ కాస్త చిలసౌ అయ్యాడు. అయితే టైటిల్ లో చి.. పక్కన అర్జున్ అని చిన్నగా పెట్టారు. హీరోగా అంత క్లిక్ అవ్వని రాహుల్ దర్శకుడిగా ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ బాగుండటంతో అక్కినేని హీరోలు కూడా చిలసౌని ప్రమోట్ చేస్తున్నారు.