కొరటాలతో చిరు.. అక్కడ సమస్య వస్తుంది..!

రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. భరత్ అనే నేను సినిమా కూడా హిట్ అందుకుని డబుల్ హ్యాట్రిక్ కు సిధ్దమైన కొరటాల శివ తన తర్వాత సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడని తెలుస్తుంది. నవంబర్ నుండి ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందట. కొరటాల శివ స్క్రిప్ట్ ఫైనల్ చేస్తుండగా ఈ సినిమాలో కాస్టింగ్ మీద దృష్టి పెట్టారట.   

ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమస్య మొదలైందని తెలుస్తుంది. 50, 60 ప్లస్ హీరోలవడం వల్ల సీనియర్ హీరోలతో జోడి కట్టే భామలు కరువయ్యారు. ఖైది నంబర్ 150 సినిమాకే కాజల్ ను సెట్ చేయడానికి చాలా రిస్క్ పడాల్సి వచ్చింది. ఇప్పుడు 152వ సినిమాగా మొదలవబోతున్న కొరటాల సినిమాకు హీరోయిన్ ప్రాబ్లెం అని తెలుస్తుంది. మరి ఫైనల్ గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.