
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అతనో స్టార్ మెటీరియల్ అని అందరికి తెలిసేలా చేసిన విజయ్ దేవరకొండ స్టార్ హీరోలను సైతం అవాక్కయ్యేలా చేశాడు. రీసెంట్ గా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటన గురించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. విజయ్ నటించిన గీతా గోవిందం సినిమా ఆడియో వేడుకలో అర్జున్ రెడ్డి సినిమా చూసి వారం రోజులు తాను ఎవరితో మాట్లాడలేదని అన్నారు.
ఈ ఇయర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ విజయ్ కే రావాలని ఆశించానని.. లాస్ట్ ఇయర్ ఒకరిద్దరు వేరే హీరోలు బాగా చేసినా విజయ్ దేవరకొండకే ఫిల్మ్ ఫేర్ ఇస్తే బాగుండేదని అనుకున్నానని.. తన కోరిక మేరకే విజయ్ కు ఫిల్మ్ ఫేర్ వచ్చినందుకు తాను సంతోషించానని అన్నారు బన్ని. ఇక తెలుగులో ఉన్న మంచి నటులలో విజయ్ కూడా ఒకరని చెప్పాడు బన్ని. మొత్తానికి అర్జున్ రెడ్డి సినిమా బన్ని మీద ఎంత ఎఫెక్ట్ చూపించింది అన్నది లేట్ గా తెలిసినా అందరిని ఆశ్చర్యపరచిందని చెప్పొచ్చు.