
సీనియర్ నటి అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్య టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకునేలా చేసింది. తెలుగులో ఎన్నో సినిమాలకు తల్లి, వదిన, అమ్మమ్మ పాత్రలతో అలరించిన అన్నపూర్ణమ్మ కొన్నాళ్లు కెరియర్ అంత బాగా లేకున్నా ఈమధ్య మళ్లీ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. అన్నపూర్ణ కూతురు కీర్తి మూడేళ్ల క్రిందట వెంకట కృష్ణను పెళ్లాడింది.
వారిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడట. భర్తతో గొడవతో ఇంటికొచ్చిన కీర్తి ఈరోజు ఉదయం బెడ్ రూం నుండి ఎంత రాకపోవడంతో అన్నపూర్ణకు డౌట్ వచ్చి తలుపు ఎంత కొట్టగా తీయకపోవడంతో పక్కన ఉన్న వారి సహాయంతో డోర్ తెరచి చూస్తే కీర్తి ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయినట్టు కనుగొన్నారు. ఆమె తరచు అనారోగ్య పాలవడం వల్ల దాంపత్య జీవితంలో ఇబ్బందులు వచ్చాయని తెలుస్తుంది. ఆమె మరణానికి కారణాలు ఏవై ఉంటాయో తెలియాల్సి ఉంది. బంజారా హిల్స్ పోలీసులు బాడీని పోస్ట్ మార్టం కు పంపించి తదుపరి విచారణ చేస్తున్నారు.