గూఢచారి ట్రైలర్.. పర్ఫెక్ట్ స్పై థ్రిల్లర్..!

అడివి శేష్ హీరోగా శషి కిరణ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గూఢచారి. ఈ సినిమాకు అడివి శేష్ కథ అందించడం విశేషం. శోభిత దూళిపాల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా రాబోతుందని తెలుస్తుంది. టీజర్ తోనే అదరగొట్టిన అడివి శేష్ లేటెస్ట్ గా ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ తో మైండ్ బ్లాంక్ చేశాడు. తెలుగులో స్పై థ్రిల్లర్ మూవీస్ ఎన్నొచ్చిన గూఢచారి తర్వాతే అనేలా ఈ ట్రైలర్ ఉంది.

తన తండ్రి రా ఏజెంట్ గా దేశం కోసం మరణించగా పిల్లాడుగా ఉన్న గోపి అలియాస్ అర్జున్ దేశం కోసం ఏం చేశాడు అన్నది ఈ సినిమా కథ. ఇందులో అతని గైడ్ గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. అమీ తుమీ తర్వాత అడివి శేష్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. థ్రిల్లింగ్ అంశాలతో వస్తున్న ఈ గూఢచారి అంచనాలను అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.