సైరాలో ఛాన్స్ కొట్టేసింది..!

మెగా ఫ్యామిలీ నుండి హీరోలు చాలా మంది వచ్చారు.. వస్తున్నారు. కాని మొదటిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్ నిహారిక. ఒక మనసు సినిమాతో ఆమె తెరంగేట్రం చేయగా ఆ సినిమా అంత సక్సెస్ అవలేదు. అయితే రెండేల్ల గ్యాప్ తర్వాత నిహారిక మళ్లీ హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగా కనిపిస్తున్న నిహారిక మెగాస్టార్ 151వ సినిమా సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.

మెగాస్టార్ సినిమాలో మెగా డాటర్ అది కూడా ప్రెస్టిజియస్ బయోపిక్ లో ఛాన్స్ అంటే మాములు విషయం కాదు. సైరాలో చిన్న పాత్రైనా చేస్తా అని రాం చరణ్ తో చెప్పిందట నిహారిక ముందు కాదని చెప్పగా అన్న కాళ్లు పట్టుకుని మరి క్యారక్టర్ కొట్టేసిందట నిహారిక. సినిమాలో గిరిజన యువతిగా నిహారిక కనిపిస్తుందని తెలుస్తుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 2019 సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.