
మోడల్ కమ్ హీరోయిన్ అలేఖ్య ఏంజెల్ వై.ఎస్ జగన్ తో దిగిన ఓ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేస్తూ తన భార్యల ప్రస్థావన తెచ్చాడు జగన్. ఇక దానికి పవన్ కూడా గట్టి రిప్లై ఇచ్చాడు. ఇది చాలదు అన్నట్టు పవన్ ఫ్యాన్స్ జగన్ తో సెల్ఫీ దిగిన అలేఖ్య ఫోటోతో ట్రోల్ చేస్తున్నారు.
రకరకాల కామెంట్స్ తో ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే జగన్ కు ఇవన్ని పట్టించుకునే టైం లేదు కాబట్టి ఆ ఫోటోలో ఉన్న అలేఖ్య ఏంజెల్ ఈ విషయంపై సీరియస్ అయ్యింది. 2017 ఫిబ్రవరిలో ఓ సినిమా ఆడియో వేడుక టైంలో జగన్ ను కావాలని తను సెల్ఫీ అడిగి తీయించుకున్నా అని.. జగన్ అంటే తనకు తండ్రి, పెద్దన్నయ్య లాంటి భావన ఉందని అలేఖ్య చెప్పుకొచ్చింది.
పవన్ ఫ్యాన్స్ ఇలా ట్రోల్ చేయడం తనకు బాధ కలిగిస్తుందని పవన్ అంటే తనకు ఇష్టమని. కాని ఆయన ఫ్యాన్స్ ఇలాంటి పనులు చేయడం మాత్రం నచ్చట్లేదని అన్నది అలేఖ్య. మొత్తానికి అప్పుడెప్పుడో జగన్ తో దిగిన ఓ సెల్ఫీ ఇంత పనిచేస్తుందని ఊహించలేదు ఈ అమ్మడు.