
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా బ్రదర్ నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ కొత్త ప్రయోగాలతో సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ అండదండలున్నా రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తున్న వరుణ్ మొదట్లో కాస్త నిరాశ పరచినా ప్రస్తుతం కుర్రాడు మంచి ఫాంలో ఉన్నాడు. ఫిదా, తొలిప్రేమ హిట్స్ తో క్రేజ్ సంపాదించిన వరుణ్ తేజ్ ఘాజి డైరక్టర్ సంకల్ప్ రెడ్డితో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకు టైటిల్ గా అంతరిక్షం అని పెట్టారు. ఇక ఇదే కాకుండా నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో వరుణ్ తేజ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మేం వయసుకి వచ్చాం సినిమా నుండి నేను లోకల్ సినిమా వరకు చిన్న సినిమాలతో సత్తా చాటుతున్న త్రినాథ రావు ప్రస్తుతం రాం తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక వరుణ్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.