ఎన్టీఆర్ వచ్చాడు.. టిఆర్పి పెంచాడు..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ క్రేజ్ ఏంటన్నది ఆయన సినిమాలు క్రియేట్ చేస్తున్న రికార్డులు చూస్తే తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా తారక్ బుల్లితెర మీద కూడా కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 1 లో సందడి చేసిన తారక్ రీసెంట్ గా ఈటివి డ్యాన్స్ షోకి గెస్ట్ గా వచ్చాడు. ఈటివి డ్యాన్స్ షో ఢీ పది సీజన్లు సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది. ఢీ-10 గ్రాండ్ ఫైనల్స్ కు ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చాడు.

ఎన్.టి.ఆర్ రావడమంటే ఫ్యాన్స్ కు పండగే.. అందుకే టి.ఆర్.పి రేటింగ్స్ లో ఈటివి డ్యాన్స్ షో లాస్ట్ వీక్ 13.9 పాయింట్స్ సాధించింది. రెగ్యులర్ గా ఆ డ్యాన్స్ షోకి ఎక్కువమంది వ్యూయర్స్ ఉన్నా ఈ రేంజ్ టి.ఆర్.పి వచ్చింది మాత్రం ఎన్.టి.ఆర్ వల్లే అని చెప్పొచ్చు. బిగ్ బాస్ చేసినప్పుడు కూడా స్టార్ మాకు అత్యధికంగా 16 పాయింట్స్ తెచ్చి ఎన్.టి.ఆర్ తన సత్తా ఏంటో చూపించాడు.