
బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో సామ్రాట్, తేజశ్విల మధ్య సంథింగ్ సంథింగ్ అన్న న్యూస్ అందరికి తెలిసిందే. ప్రేమ పరవశంలో మునిగి తేలుతున్నట్టుగా వారిద్దరి ప్రవర్తన ఉంది. హౌజ్ లో సామ్రాట్ అంటే కేరాఫ్ తేజశ్వి అని అనుకునేలా ఇన్ని వారాలు నడిచింది. అయితే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లో సామ్రాట్ ను వదిలి తేజశ్వి బయటకు వచ్చింది. ఇక వచ్చిన దగ్గర నుండి ఇంటర్వ్యూస్ తో హడావిడి చేస్తున్న అమ్మడు తాజాగా తన ఫ్యాన్స్ కోసం ఫేస్ బుక్ లైవ్ చాట్ చేసింది.
అందులో భాగంగా సామ్రాట్ లో తను చేసింది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అని చెప్పింది. మా మధ్య ప్రేమ దోమా లాంటిది ఏది లేదని వుయ్ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది తేజశ్వి. ఇంట్లో సామ్రాట్ ప్రవర్తన చూసి తేజశ్వి క్లోజ్ అయ్యి ఉండొచ్చు అయితే బయటకు వచ్చాక అతని భార్య గొడవ.. ఆమె చేసిన హంగామా అంతా తెలుసుకుని తేజూ ఇలా మాట మార్చేసిందని చెప్పొచ్చు. ఎలిమినేట్ అయ్యాక నానితో స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా సామ్రాట్ ఐలవ్యూ అని చెప్పిన తేజశ్వి ఇలా సడెన్ గా చాట్ లో స్నేహితులమే అనడం వెనుక అర్ధం ఏంటో ఆమెకే తెలియాలి.