
కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్స్ గా అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన సినిమా ఆరెక్స్ 100. 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు రెట్లు ఎక్కువ కలక్షన్స్ సాధించి విజయవంతంగా దూసుకెళ్తుంది. పాయల్ అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆరెక్స్ 100 సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టింది.
అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు ఆరెక్స్ 100 యూఎస్ లో కేవలం 1,30,000 డాలర్స్ మాత్రమే వసూళు చేయగలిగింది. కచ్చితంగా అక్కడ ఆరెక్స్ 100 పెద్ద డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఓవర్సీస్ ఆడియెన్స్ కు ఈ సినిమా ఏమాత్రం నచ్చలేదు. కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా సూపర్ సక్సెస్ అనిపించుకోగా కొంతమంది ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా నచ్చింది. ఇక ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ కు ఇప్పటికే రెండు క్రేజీ ఛాన్సులు వచ్చాయని తెలుస్తుంది.