
అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ హీరోగా తన పాపులారిటీ పెంచుకున్నాడు. చేసిన 3 సినిమాలే అయినా విజయ్ సినిమా అంటే ఒక బ్రాండ్ గా మారింది. ప్రస్తుతం గీతా గోవిందం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ తన తమ్ముడిని హీరోగా పరిచయం చేయాలని చూస్తున్నాడు. విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు.
ఎం.వి.ఆర్ మహేంద్ర డైరక్షన్ లో సురేష్ బాబు నిర్మాతగా ఆ సినిమా వస్తుందట. సినిమాలో దొరసానిని ప్రేమించే యువకుడిగా ఆనంద్ కనిపిస్తాడట. ఈ సినిమాకు టైటిల్ గా దొరసాని అని పెట్టబోతున్నారట. ఈమధ్యనే తన ఫ్యాన్స్ తో రౌడీ గ్యాంగ్ తయారు చేసిన విజయ్ దేవరకొండ తన తమ్ముడికి ఎలాంటి సపోర్ట్ ఇస్తాడో చూడాలి. సురేష్ బాబు ప్రొడక్షన్ లో ఇంట్రడ్యూస్ అవడం గొప్ప విషయమని చెప్పొచ్చు. విజయ్ తమ్ముడు అనగానే అంచనాలు ఉంటాయి వాటిని ఆనంద్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.