
బాహుబలి తర్వాత రాజమౌళి ఏ ప్రాజెక్ట్ చేస్తాడన్న విషయం మీద నేషనల్ మీడియా కూడా ఓ కన్నేసి ఉంది. జక్కన్న ప్రకటించిన ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ముందు 150 కోట్లతో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాలని అనుకున్న ఈ సినిమా హిందిలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అందుకు బడ్జెట్ పరిమితులు కూడా లేవని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా కీర్తి సురేష్, పూజా హెగ్దెలను సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. అయితే శ్రీదేవి కూతురు జాన్విని ఈ సినిమాలో నటింప చేయాలని చూస్తున్నాడట బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. జాన్వికి గాడ్ ఫాదర్ గా మారిన కరణ్ తన కెరియర్ కు సపోర్ట్ గా నిలుస్తున్నాడు. రాజమౌళి సినిమాలో ఛాన్స్ దొరికితే ఇక జాన్వి కెరియర్ కు తిరుగు ఉండదు. ఈ ట్రిపుల్ ఆర్ లో కూడా కరణ్ జోహార్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉంటున్నాడని తెలుస్తుంది. మరి కరణ్ సలహాతో రాజమౌళి జాన్విని ట్రిపుల్ ఆర్ లో భాగం చేస్తాడా లేదా అన్నది చూడాలి.