
మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లికి సిద్ధమైందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. తెలుగు, తమిళ భాషల్లో తన మిల్కీ అందాలతో అందరిని అలరించిన తమన్నా బాహుబలి లాంటి మూవీలో నటించినా సరే కాలం కలిసి రాలేదు. 12 ఏళ్లుగా సౌత్ లో హీరోయిన్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకున్న తమన్నా ప్రస్తుతం కెరియర్ దాదాపు ముగిసిందని భావిస్తుంది.
ప్రస్తుతం క్వీన్ రీమేక్ లో నటిస్తున్న తమన్నా.. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ సినిమాలో కూడా ఛాన్స్ పట్టిసింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత తన పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెడుతుందట. కెరియర్ ఎలాగు అంత జోష్ గా లేదు కాబట్టి అమ్మడికి పెళ్లివైపు గాలి మల్లిందని తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఆల్రెడీ ఓ వరుడిని కూడా చూశారట. అమెరికాకు చెందిన ఓ డాక్టర్ తమన్నాతో పెళ్లికి రెడీ అన్నాడట. చూస్తుంటే మిల్కీ బ్యూటీ కూడా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఉంది. తమన్నా మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.