
వైఎస్సార్ జీవిత చరిత్ర ఆధారంగా మహి వి రాఘవ దర్శకత్వంలో యాత్ర మూవీ తెరకెక్కుతుంది. 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. మళయాల స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో వై.ఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటిస్తున్నాడని తెలుస్తుంది.
వై.ఎస్ కుటుంబంతో సూర్య చాలా సన్నిహితంగా ఉంటారు. మొదట వై.ఎస్ జగన్ పాత్రలో సూర్య కనిపిస్తాడని అన్నారు. కాని కార్తి ఆ పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నారట. అయితే దీనికి సంబందించిన అఫిషియల్ స్టేట్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంతో రాబోతున్న ఈ యాత్ర మూవీ 2019 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.