
జబర్దస్త్ షోతో సూపర్ పాపులారిటీ సంపాదించిన అనసూయ, రష్మిలి చేసేది వేరు వేరు షోలే అయినా కాన్సెప్ట్ మాత్రం ఒకటే. అనసూయ కొద్దిగా గ్యాప్ ఇవ్వడంతో జబర్దస్త్ లోకి రష్మి ఎంటర్ అయ్యింది. ఆ తర్వాత రష్మి కూడా క్రేజ్ తెచ్చుకోవడం.. అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇద్దరికి జబర్దస్త్, ఎక్స్ ట్రీ జబర్దస్త్ అప్పగించారు. షోలు వేరైనా ఇద్దరి మీద కమెడియన్ల పంచులు కామన్.
అంతేకాదు తన దగ్గర నుండి జబర్దస్త్ లాగేసుకుందని అనసూయ, రష్మిల మధ్య దూరం ఉందని కూడా అంటారు. ఎప్పటికప్పుడు ఈ వార్తలను కొట్టి పారేస్తున్న ఈ ఇద్దరు కలవడం చాలా అరుదు కాబట్టి ఈ వార్తలు వస్తుంటాయి. అయితే లేటెస్ట్ గా ఓ పాటకు ఇద్దరు కలిసి సరదాగా స్టెప్పులేస్తున్న తీరు చూస్తే వీరు చెప్పేది నిజమే అనక తప్పదు. బాబూజీ జర ధీరే చలో సాంగ్ కు అనసూయ, రష్మి ఎంచక్కా డ్యాన్స్ చేస్తున్నారు. ఏదో రిహార్సెల్స్ లా అనిపిస్తున్న ఆ వీడియోలో అనసూయ, రష్మిలు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. సో ఇద్దరి మధ్య ఏమి లేదు అన్నది ఇప్పటికైనా క్లియర్ అయినట్టే. ఇంతకీ ఈ భామలు ఏ స్టేజ్ మీద వేసేందుకు ఇంతలా కష్టపడుతున్నారు అన్నది తెలియాల్సి ఉంది.