
బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నా హీరోగా నిలబడాలని బాగానే ట్రై చేస్తున్నాడు. మొదటి సినిమా అల్లుడు శీను సినిమాలోనే సమంత తో రొమాన్స్, తమన్నాతో ఐటం సాంగ్ చేసిన బెల్లంకొండ వారసుడు ఆ తర్వాత సినిమాల్లో కూడా స్టార్ హీరోయిన్స్ తోనే జోడి కడుతూ వచ్చాడు. రకుల్ తో జయ జానకి నాయకా సినిమా చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ గా కాజల్ తో కూడా రొమాన్స్ కు రెడీ అయ్యాడు.
ఒకటి కాదు రెండు సినిమాల్లో కాజల్ తో జోడి కడుతున్న బెల్లంకొండ బాబు ఒక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆరెక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా నటించనుందట. ఆరెక్స్ 100తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న పాయల్ సినిమాలో ఉంటే అదనపు ఆకర్షణ అని బెల్లంకొండ శ్రీనివాస్ ఆమెను సెలెక్ట్ చేశాడట. నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమా ముహుర్తం త్వరలో పెట్టనున్నారు.