
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తుంది. 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సాహో పూర్తవ్వకముందే ప్రభాస్ మరో మూవీకి రెడీ అవుతున్నాడు. సాహో చేస్తున్న యువి బ్యానర్ లోనే ప్రభాస్ తన తర్వాత సినిమా కూడా చేస్తున్నాడట.
జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుందట. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దెని సెలెక్ట్ చేశారట. 1940-50 ల మధ్య జరిగే ప్రేమకథగా ఈ సినిమా కథ ఉంటుందట. మొత్తానికి ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు చేసినా డిజేతో దుమ్మురేపిన పూజా ఎన్.టి.ఆర్, మహేష్ లతో పాటుగా ప్రభాస్ తో కూడా ఛాన్స్ దక్కించుకుంది. చూస్తుంటే అమ్మడు ఇక్కడ టాప్ హీరోయిన్ గా సత్తా చాటేలానే ఉంది.