కవిత ఛాలెంజ్ స్వీకరించిన రాజమౌళి..!

ఫిట్ నెస్ ఛాలెంజ్ లానే తెలంగాణాలో గ్రీన్ ఛాలెంజ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఏదైనా కార్యక్రమం జనాల్లోకి వెళ్లాలంటే అది కచ్చితంగా సెలబ్రిటీస్ ప్రమోషన్స్ వల్లే అవుతుంది. అందుకే షాపింగ్ మాల్స్ కు, వాణిజ్య ప్రకటనలకు స్టార్స్ వెంట పడతారు. ఇక ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సిఎం కే.సి.ఆర్ కూతురు ఎంపి కల్వకుంట్ల కవిత రాజమౌళికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

కొద్దిరోజుల క్రితం కవిత మొక్కలు నాటి అందుకు కొనసాగింపుగా ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగస్వామ్యం అవ్వాలని రాజమౌళిని కోరింది. అయితే ఈరోజు రాజమౌళి కవిత గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి తన ఫాం హౌజ్ లో మర్రి, గుల్మోహార్, మలబారు వేప చెట్టులను నాటారు. మొక్కను నాటి ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టారు రాజమౌళి. ఇక ఈ గ్రీన్ ఛాలెంజ్ ను ఫార్వడ్ చేస్తూ మంత్రి కే.టి.ఆర్, బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్, డైరక్టర్స్ నాగ్ అశ్విన్, సందీప్ వంగలకు ఛాలెంజ్ విసిరాడు. మరి వారు ఎలా రాజమౌళి ఛాలెంజ్ స్వీకరిస్తారో చూడాలి.