నితిన్ సినిమాకు భారీ డీల్..!

లవర్ బోయ్ నితిన్ హీరోగా శతమానం భవతి డైరక్టర్ సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు నిర్మాణంలో క్రేజీ మూవీగా వస్తున్న ఈ మూవీ ఆగష్టు 9న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా టీజర్, సాంగ్స్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. అఆ తర్వాత లై, ఛల్ మోహన్ రంగ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు నితిన్.

శ్రీనివాస కళ్యాణం సినిమా ఓవర్సీస్ లో 3 కోట్ల దాకా పలికిందట. పెళ్లి విశిష్టతను చెప్పే సినిమాగా తెరకెక్కిన ఈ మూవీపై దర్శక నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఓవర్సీస్ లో 3 కోట్ల బిజినెస్ అంటే మిలియన్ డాలర్స్ వసూళు చేస్తే కాని సినిమా సేఫ్ ప్రాజెక్ట్ లోకి రాదు. మరి నితిన్, రాశి ఖన్నా నటించిన ఈ శ్రీనివాస కళ్యాణం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.