నిర్మాతల మధ్య నలిగిపోతున్న దర్శకుడు..!

దిల్ రాజు నిర్మాణంలో కొత్తబంగారు లోకం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత తెలుగు తెర మీద కనుమరుగైన స్టార్ మల్టీస్టారర్ సినిమా తీసి క్రేజ్ తెచ్చుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్, విక్టరీ వెంకటేష్ లతో తీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల ప్రతిభను ప్రేక్షకులకు తెలిసేలా చేసింది.

ఆ నమ్మకంతోనే మహేష్ మరోసారి శ్రీకాంత్ అడ్డాలకు ఛాన్స్ ఇచ్చాడు. బ్రహ్మోత్సవం శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో వచ్చింది. కాని ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సినిమా మహేష్ కెరియర్ లో డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా మిగిలింది. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాలకు ఛాన్సులు కూడా కరువయ్యాయి. ఈమధ్యనే శ్రీకాంత్ కు గీతా ఆర్ట్స్ నుండి పిలుపొచ్చిందని అన్నారు. అయితే మరోసారి దిల్ రాజు శ్రీకాంత్ కు ఛాన్స్ ఇచ్చి చూడాలని అనుకుంటున్నాడట. ఇద్దరు డిస్కషన్స్ అయితే జరిపారట కాని ఎవరు ఫైనల్ చేయలేదట. ఇద్దరి మధ్యలో శ్రీకాంత్ అడ్డాల నలిగిపోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.