
రీల్ లైఫ్ హీరోలుగా అందరు ఉంటారు. కాని రియల్ లైఫ్ హీరోగా ఉండే వాళ్లు చాలా తక్కువ. అలాంటి వారిలో కచ్చితంగా కోలీవుడ్ హీరో సూర్య వస్తాడు. కోలీవుడ్ హీరో అయినా తెలుగులో కూడా క్రేజీ ఫాలోవర్స్ ను ఏర్పరచుకున్నాడు సూర్య. ఇప్పటికే అగరం ఫౌండేషన్ ద్వారా పేదలకు విద్యను అందిస్తూ.. స్కాలర్ షిప్ లను కూడా అందేలా చేస్తున్న సూర్య ఇప్పుడు రైతుల కోసం ఏకంగా కోటి విరాళాన్ని ప్రకటించాడు.
హీరోగా సూర్య తెలుగు, తమిళ భాషల్లో మంచి పాపులారిటీ సంపాదించాడు. ఇక ఈమధ్యనే నిర్మాతగా కూడా మారి సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా తమ్ముడు కార్తితో చినబాబు సినిమా చేసిన సూర్య అందులో కూడా రైతుల గురించి గొప్పగా చూపించాడు. ఇక లేటెస్ట్ గా రైతుల సంక్షేమం కోసం అగరం ఫౌండేషన్ నుండి కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయం తెలిసిన వారు సూర్య నువ్వు సూపరంతే అంటున్నారు.