నిహారిక 'సూర్యాకాంతం'..!

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే ఓ సాహసం అనుకుంటుండగా ఇప్పుడు మరో క్రేజీ రోల్ లో కనిపించేందుకు సిద్ధం కావడం విశేషం. ఒక మనసు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిహారిక ఆ సినిమా ఫ్లాప్ వల్ల రెండేళ్లు గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం హ్యాపీ వెడ్డింగ్ అంటూ సుమంత్ అశ్విన్ తో కలిసి వస్తుంది ముద్దుల మెగా డాటర్. 

ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ డైరక్టర్ లక్ష్మణ్ కార్య హ్యాపీ వెడ్డింగ్ ను డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత నిహారిక మరో వెబ్ సీరీస్ చేయబోతుందట. రీసెంట్ గా నాన్న కూచి అనే వెబ్ సీరీస్ డైరెక్ట్ చేసిన ప్రవీణ్ ఈ వెబ్ సీరీస్ డైరెక్ట్ చేయబోతున్నాడట. ఈ వెబ్ సీరీస్ కు సూర్యాకాంతం అని టైటిల్ పెట్టారట. సినిమాలో ఆమె పాత్ర అంత గడుసుగా ఉంటుందని ఆ టైటిల్ ప్రిఫర్ చేశారట. వెబ్ సీరీస్ అంటున్నా ఇదేదో సినిమా టైటిల్ లా ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు. మరి సూర్యకాంతం వెబ్ సీరీస్ మాత్రమేనా సినిమాగా వస్తుందా అన్నది చూడాలి.