
విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా గీతా గోవిందం. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ పక్కన రష్మిక మందన నటిస్తుంది. కన్నడ కిరాక్ పార్టీతో సూపర్ క్రేజ్ సంపాదించిన రష్మిక తెలుగులో చేసిన మొదటి సినిమా ఛలో కూడా సూపర్ హిట్ అవడంతో అమ్మడు ఇక్కడ కూడా క్రేజీ ఫ్యాన్స్ ను ఏర్పరచుకుంది.
ఇక విజయ్ దేవరకొండతో కలిసి చేస్తున్న గీతా గోవిందం కూడా మంచి కాంబినేషన్ అంటున్నారు. ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. టీజర్ చాలా క్రేజీగా ఉంది. హీరోయిన్ వెంట మేడం.. మేడం అంటూ హీరో పడుతూ చేసే అల్లరి బాగుంది. ఇక అర్జున్ రెడ్డి తర్వాత రాబోతున్న ఈ గీతా గోవిందం విజయ్ క్యారక్టర్ లో కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను బన్ని వాసు నిర్మిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆగష్టు లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.