అరవింద సమేత ఈ లీక్స్ గోలేంటి..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కెరియర్ లో మొదటిసారి త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అరవింద సమేత టైటిల్ తో వస్తున్న ఈ మూవీలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా సెట్స్ మీద ఉండగానే ఈ సినిమాలోని పిక్స్ లీక్ అవడం సంచలనంగా మారాయి. స్టార్ సినిమా అంటే ఆడియెన్స్ లో ఎక్సైట్మెంట్ ఓ రేంజ్ లో ఉంటుంది. దాని కోసం ఎక్కడ ఏ పిక్ లీక్ అవుతుందా అని ఆరా తీస్తారు.

ప్రస్తుతం అరవింద సమేతలోని ఓ పిక్ వైరల్ గా మారింది. కారులో గాయాలతో ఉన్న ఎన్.టి.ఆర్ పక్కనే స్ప్రుహలో లేని నాగబాబు పిక్ లీక్ చేశారు. చూస్తుంటే ఇదేదో ఫైట్ సీన్ లోని భాగం అనిపిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న అరవింద సమేత సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. మరి ఈ లీక్స్ వల్ల సినిమాపై అంచనాలు పెరుగుతున్నా సినిమా యూనిట్ ఇంకాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.