రెజీనా స్వీట్ కోసం గర్భిణి అయిందట!

"మామూలుగానే నేను చాలా కోతిని, నాకు నచ్చింది సాధించుకోవడం కోసం ఇంకా పెద్ద కోతినవుతాను అంటోంది రెజీనా కెసాండ్రా. ఎస్సెమ్మెస్ సినిమా సక్సెస్ తర్వాత, కుర్ర హీరోలకి పెర్ఫెక్ట్ గా సరిపోయే పర్సనాలిటీ అని పేరు తెచ్చుకొని, కొత్త పాత అనే తేడా లేకుండా చాలా మంది కుర్ర హీరోల పక్కన నటించింది. కొత్త జంట, సుబ్రమణ్యం ఫర్ సేల్, పవర్ వంటి మంచి హిట్లున్న ఈ గుమ్మకి, ఇటీవల ఫ్లాప్ ఐన శౌర్య సినిమాతో ఫాలోయింగ్ బాగా తగ్గిందనే చెప్పాలి. ఆ ఎఫెక్ట్ మరింత పెరుగుతుందనే భయంతోనేనేమో, తన గురించి ఇప్పుడొక హాట్ న్యూస్ చెప్పింది. 

తనకెంతో ఇష్టమైన మిష్టి డోయ్ అనే స్వీట్ ఒక రోజు, అర్ధ రాత్రి స్వీట్ షాపులో గమనించి కొనుక్కోవాలనుకుందట. అయితే మరీ లేట్ అవడంతో, ఆ షాప్ ఓనర్, స్వీట్ అమ్మనని చెప్పడంతో, తనో గర్భిణీ స్త్రీ అని చెప్పుకుందట. అక్కడితో జాలి పడిన ఓనర్, స్వీట్ రెజీనా కి అమ్మాడట. ఇలాంటి కోతి వేషాలు తానెన్నో వేశానని సరదాగా చెప్పుకొచ్చింది రెజీనా. ప్రస్తుతం నారా రోహిత్ పక్కన 'జ్యో అచ్యుతానంద' అనే సినిమా రెజీ చేతిలో ఉంది.