
అక్కినేని యువ హీరో అఖిల్ తన మూడవ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అతని బాలీవుడ్ ఎంట్రీ ఉండబోతుందని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. తనయుల కెరియర్ విషయంలో కాస్త టెన్షన్ పడుతున్న నాగార్జున నాగ చైతన్యకు ఎలాగు లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చి పెట్టాడు. కథల విషయంలో చైతు స్పీడ్ అందుకున్నాడు. వరుస సినిమాలను ఓకే చేస్తున్నాడు.
ఇక ఎటొచ్చి అఖిల్ మూడు సినిమాలను 3 ఏళ్లు చేశాడు. ప్రస్తుతం తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా చేస్తున్న అఖిల్ ఆ తర్వాత బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మాణంలో సినిమా చేస్తాడని అంటున్నారు. అఖిల్ బాలీవుడ్ ఎంట్రీకి సర్వం సిద్ధమైందని తెలుస్తుంది. అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావడమే తరువాయని అంటున్నారు. నాగార్జున బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర సినిమా చేస్తున్నాడు. అక్కడే ఈ డీల్ సెట్ చేశాడని ముంబై మీడియా టాక్.