
సూపర్ స్టార్ మహేష్ ఇన్నాళ్లు టాలీవుడ్ లోనే నెంబర్ 1 హీరో అనుకున్నాం కాని ఇప్పుడు సౌత్ ఇండియా సినిమాల్లో నెంబర్ 1 గా నిలిచాడు మహేష్ బాబు. ముఖ్యంగా సోషల్ బ్లాగ్ ఫాలోవర్స్ లో మహేష్ కు ఏకంగా 13 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. ట్విట్టర్ లో 6.6 మిలియన్స్, ఫేస్ బుక్ లో 5.1, ఇన్ స్టాగ్రాంలో 1.4 మిలియన్ ఫాలోవర్స్ తో మహేష్ క్రేజీ ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు.
ఈ రకంగా ఫాలోవర్స్ ఉన్న వారిలో సౌత్ లో టాప్ లో ఉన్నాడు మహేష్. భరత్ అనే నేను తర్వాత మహేష్ ప్రస్తుతం 25వ సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే.